
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన నేపధ్యంలో రాష్ట్రంలో కొత్త వివాదం తలెత్తుతోంది. ప్రభుత్వ ప్రకటనల్లో ప్రజాధనం దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ప్రకటనల్లో నారా లోకేశ్ ఫోటో మొత్తం వివాదానికి కారణమౌతోంది. “ఏ హోదాలో రెడ్ బుక్ మంత్రి నారా లోకేష్ ఫోటోలను వందల కోట్ల రుపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ప్రకటనల లో ఎలా ఇచ్చారు? అంటూ ప్రతిపక్ష వైఎస్సార్ సిపి ప్రశ్నిస్తోంది.
విశాఖపట్నంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పురస్కరించుకుని వివిధ పత్రికల్లో వచ్చిన ప్రకటనలపై ట్రోలింగ్ జరుగుతోంది. ప్రకటనల్లో మంత్రివర్గం నుంచి కేవలం నారా లోకేశ్ ఫోటో మాత్రమే ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. నారా లోకేష్ ఫోటో ఏ హోదాతో ప్రచురించారంటూ ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఏపీ ప్రభుత్వం వివిధ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. సాయంత్రం 4.15 గటలకు విశాఖకు ప్రత్యేక విమానంలో చేరుకునే ప్రధాని మోదీ సాయత్రం 5.30 గంటల వరకూ రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తురవాత 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుంచి వర్చువల్ విధానంలో పలు శంకుస్థానపలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తరువాత తిరిగి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరనున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని ప్రగతి ప్రదాతకు స్వాగతం అంటూ ఏపీ ప్రభుత్వం వివిధ పత్రికల్లో అధికారికంగా ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనే ఇప్పుడు కొత్త వివాదానికి కారణమౌతోంది.
ఈ ప్రకటనలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు మంత్రి నారా లోకేశ్ ఫోటో కూడా ఉంది. ఇదే ఇప్పుడు ట్రోలింగ్ అవుతోంది. మంత్రివర్గం అంటే అందరు మంత్రుల ఫోటోలు ఉండాలి. కేవలం నారా లోకేష్ ఫోటో మాత్రమే ఉండటం దేనికి సంకేతమనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇదే అంశంపై ట్రోలింగ్ మొదలైంది.
ఈ ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. ఏ హోదాలో రెడ్ బుక్ మంత్రి నారా లోకేశ్ ఫోటోను ప్రచురించారని షేర్ చేశారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ప్రకటనలు ఎలా ఇచ్చారంటున్నారు. షాడో సీఎం హోదాలోనా లేక సకల మంత్రి హోదాలోనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చేవాటిలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మర్చిపోతే ఎలా అంటున్నారు.