
Joining YCP
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. సీఎం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి అనేక మంది వైసీపీలో చేరుతున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరిలో జిల్లాలో వైసీపీలో చేరికలో భారీగా పెరిగాయి. తాజాగా తణుకు మండంలో 150 కుటుంబాలు వైసీపీలో చేరాయి.
అత్తిలి మండలంలోనూ భారీ సంఖ్యలో వైసీపీలో చేరారు. అత్తిలి మండలంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన దాదాపు 200 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జగన్ పాలన నచ్చే అనేక మంది వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పారు. ఇంకా చాలా మంది జగన్ బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జగన్ సర్కారు సంక్షేమ పాలన సాగిస్తోందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.