
indiradevi
సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరాదేవి మొదటి భార్య. కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం. కుమారులు రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. పెద్ద కుమారుడు రమేశ్‌బాబు కొంతకాలం క్రితం చనిపోయారు. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్ లోకి వెళ్లారు. అది ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
ఇందిరాదేవి మరణం కృష్ణకు తీరని లోటని చెప్పాలి. రెండేళ్ల క్రితం విజయ నిర్మల కన్నుమూశారు. ఈ ఏడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందారు. ఇప్పుడు మొదటి భార్య ఇందిరా దేవి తుది శ్వాస విడిచారు.
ఇందిరాదేవి మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇందిరాదేవి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మహేశ్ బాబు, కృష్ణకు తమ సానుభూతిని ప్రకటించారు.