
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు! నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీ నాయకులు చేసిన డిమాండ్ తీవ్ర చర్చలు, ఊహాగానాలను రేపుతోంది. టీడీపీ నేత మహా సేన రాజేష్ ఈ డిమాండ్ టీడీపీ క్యాడర్ల విజ్ఞప్తిగా తెరపైకి తీసుకురాగా. టీడీపీ సభ్యులు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని పార్టీ వేదికలో ప్రస్తావించడం అనేక సందేహాలను, ప్రశ్నలను రేకేస్తుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గా ఉన్నారు, ఆయన టీడీపీ-జనసేన కూటమి సమన్వయానికి కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని అనడంలోకారణాలు ఏంటి ? ప్రస్తుత నేతృత్వం అసంతృప్తికరంగా ఉందని చెప్పాలనుకుంటున్నారా? లేదా ఇది నాయుడు వంశాన్ని మరింత బలోపేతం చేసేందుకు తయారు చేసిన ఒక రాజకీయ వ్యూహమా?
తాజాగా జరిగిన టీడీపీ సమావేశంలో ఈ విషయంపై చర్చలు వేడి చెలరేగాయి. పార్టీలోని శ్రీనివాస్ రెడ్డి సాహసంగా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి అని , మూడో తరం నేతగా స్థాపించాల్సిందిగా చంద్రబాబునాయుడికి సూచించారు. దీనికి ఆయన ఎలాంటి ప్రక్షిప్తి, తిరస్కారం లేకుండా కేవలం మౌనం పాటించారు. ఇది టీడీపీ-జనసేన కూటమిలో ఆందోళనలు రేపింది. జనసేన నాయకులు ఈ నిర్ణయాన్ని తమ నాయకుడు పావన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు రెండో డిప్యూటీ సీఎం అవసరం ఎందుకు? ఇది రాజకీయ సరికొత్త ఆవిష్కరణనా? లేకపోతే అంతర్గత వివక్షతను శాంతపర్చేందుకు తీసుకున్న ఓ హద్దుగా చెప్పదలచిన చర్యనా? లోకేశ్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంటే,మరి పావన్ కళ్యాణ్ ఎందుకు ?మరోవైపు, చంద్రబాబునాయుడి మౌనం ఈ విషయంపై అనేక ఊహాగానాలు రేకెత్తిస్తోంది. ఈ మొత్తం ఘటన ఒక రాజకీయ పటించిదిగా మారిపోయింది. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేస్తున్న ప్రతిపాదన కూటమిని కుదిపేసింది.