
laxmi parvathi
- ఎన్టీఆర్ పేరు జిల్లాకు ఉండాలా.. యూనివర్సిటీకి ఉండాలా అంటే.. జిల్లాకే నా ఓటు
- ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడ్డవారు చంద్రబాబు
- నిప్పులు చెరిగిన నందమూరి లక్ష్మీపార్వతి
టీడీపీ, ఆ పార్టీ నాయకులకు వత్తాసు పలికే ఎల్లో మీడియా సోషల్ మీడియాలో.. గత నాలుగురోజులుగా తనపైనా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైనా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నట్లు నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్ అసలు తనను వివాహమే చేసుకోలేదని, నందమూరి ఇంటిపేరు వాడుకునే హక్కులేదని అతి దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు చేసిన ద్రోహంపై.. అప్పటి తరం.. ఇప్పుడొస్తున్న యువతరం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ పేరును ఎంతగా అణగదొక్కాలని చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే మీడియా ప్రయత్నించినా… ఆ చరిత్ర మళ్లీ పునరావృతమై మరింత విజృంభిస్తోందన్నారు.
నేను అడ్డుపడి ఉంటే.. ఎన్టీఆర్ కేబినెట్ లో చంద్రబాబు రెండు కీలక శాఖలు ఆర్థిక, రెవెన్యూ మంత్రి అయ్యేవాడా..?. చంద్రబాబే ఒక అబద్ధమని, ఆ అబద్ధాలతోనే ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన మోసాలను ప్రజలు తెలుసుకోవాలన్నారు.
చంద్రబాబుకు వంతపాడి కన్నతండ్రినే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంపుకున్నారన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ ను వెనుక నుంచి కత్తితో పొడిచిన వారే.. ఇవాళ ముందుకు వచ్చి ఆయన విగ్రహాలకు దండలు వేస్తున్నారన్నారు. రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన బిడ్డలైపోరని, ఆయన గౌరవాన్ని కాపాడకుండా, ఆయన్ను అవమానిస్తుంటే కనీసం అడ్డుకోని వారు, అడ్డు చెప్పని వారు బిడ్డలెలా అవుతారు..? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే అసమ్మతి వచ్చేస్తుందా? నాకే గనుగ అధికార ఆపేక్ష ఉంటే.. చంద్రబాబుకు కీలక పదవులు వచ్చేవా? అని ప్రశ్నించారు.
“చంద్రబాబు అనే పాముకు పాలుపోసి పెంచుతున్నావంటూ అప్పట్లోనే ఎన్టీఆర్‌గారు నన్ను హెచ్చరించారు. నాడు ఎన్టీఆర్‌గారు ఎక్కడ ప్రధానమంత్రి అవుతారో అన్న భయంతో కొంతమంది కుట్రలు చేయలేదా? ఎన్టీఆర్‌ను చంపిన హంతకులకు ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా నోళ్లు మూసుకుంటే మంచిది.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, రాష్ట్రంలో ఏదైనా శాశ్వత పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టాడా?. ఎన్టీఆర్‌గారికి వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమైన బాబు, ప్రజల దృష్టిని మరల్చడానికే నాడు రాజీవ్‌గాంధీ హెల్త్ యూనివర్శిటీగా ఉన్న దాని పేరు మార్చి అప్పటికప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టాడు. ”
-లక్ష్మీ పార్వతి
‘జిల్లా పెద్దదా? యూనివర్సిటీ పెద్దదా? అని ఎవర్ని అడిగినా చెబుతారు.. జిల్లానే పెద్దది అని. అటువంటిది ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెడితే మీకెందుకు బాధ..?. ప్రభుత్వం కనుక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలా? లేక హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలా అని ప్రతిపాదించి ఉంటే.. జిల్లాకే ఎన్టీఆర్ పేరు ఉండాలని నేను కోరుకుంటాను. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు అభినందించని వీళ్లు… ఇవాళ తిట్టడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎన్టీఆర్‌గారి పేరు జిల్లాకు పెట్టడంతోనే ముఖ్యమంత్రి జగన్ ఎన్టీఆర్ పై ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయో అర్థం అవుతుంది’ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.
ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడింది చంద్రబాబే అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఈ విషయాన్ని ఇటీవల యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా మీడియాలో చెప్పినట్లు గుర్తు చేశారు. రూపాయి వైద్యుడిగా పేరు గడించి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించి, మెడికల్ కాలేజీలను తెచ్చి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్ఆర్ పేరును యూనివర్సిటీకి పెట్టడమే సముచితం అన్నారు లక్ష్మీపార్వతి.
ఎన్టీఆర్ తో తన వివాహం తిరుపతిలో చాలా చక్కగా జరిగిందనేది వాస్తవమన్నారు లక్ష్మీపార్వతి. ‘తిరుపతిలో మా పెళ్లి గురించి ఎన్టీఆర్ ప్రకటన చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మా వివాహం జరిగినట్లు పత్రికాముఖంగా తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను, వీడియో క్లిప్స్ ను మీడియా సమక్షంలో ప్రదర్శించారు. మా వివాహంపై అప్పట్లో రేణుకా చౌదరి ‘దమ్మున్న మగాడు’ అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే.. టీడీపీ వాళ్లే మాకు దండలు కూడా మార్చించారు. ఎందుకంటే చంద్రబాబుకు మొదటి నుంచి మా పెళ్లి అంటే ఇష్టం లేదు. మా పెళ్లి ప్రకటన సమయంలోనూ మైక్‌లు ఆపివేయించి, పవర్ కట్ చేయించి అతి దారుణంగా అడ్డుపడ్డాడు. సాక్షుల సమక్షంలోనే ఎన్టీఆర్‌గారు నా మెడలో తాళికట్టారు. చాలా సింపుల్‌గా మా వివాహం జరిగింది. మా పెళ్లి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తున్నాను. మా వివాహం మీద విమర్శలు, ఆరోపణలు చేస్తే ఈసారి అలాంటివారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాను’ అని హెచ్చరించారు.
ఆస్తులన్నీ పిల్లలకు ఇచ్చేసి..
ఎన్టీఆర్ ఆరోగ్యం బాగోలేదు కాబట్టే ఆయనను దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చిందన్నారు లక్ష్మీపార్వతి. ‘ఎన్టీఆర్ కు బ్రెయిన్ లో క్లాట్ వల్ల శరీరం సహకరించేది కాదు. చెయ్యి పనిచేయలేదు. అందుకే భోజనం నోటికి అందించాను. ఆయనకు ప్రతిక్షణం నా అవసరం ఉంది కాబట్టే.. సభలకు, ఎన్నికల ప్రచారాలకు తీసుకువెళ్లారు. లక్ష్మీపార్వతి తనకు భార్యే కాదు, తల్లి కూడా అని ఎన్టీఆర్ అప్పట్లో నేషనల్ ఫ్రంట్ నాయకులతో చెప్పిన మాటలు అన్ని పత్రికలు ప్రచురించాయి కూడా. ఆస్తులన్నీ తన పిల్లలకు ఇచ్చేసి, ఎన్టీఆర్ కేవలం శాంతి కుటీరం మాత్రమే తన పేరుమీద పెట్టుకున్నారు. అలాంటి సమయంలోనే ఆయన జీవితంలోకి వచ్చాను. ఎన్టీఆర్‌గారి ఆరోగ్యంతో పాటు ఆయన అధికారాన్ని తిరిగి తీసుకువచ్చానని గర్వంగా చెబుతాను. ఎన్టీఆర్ ‘ఆఖరి వీలునామా’ లో అనేక విషయాలు తెలిపారు. ఆ చివరి ఇంటర్వ్యూలో చంద్రబాబు చేసిన దురాగతాలు, ఎన్టీఆర్‌గారికి నా మీద ఉన్న గౌవరం, అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదని చెప్పడానికి ఉదాహరణ.