
allu arjun and allu sirish
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో బన్నీ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. క్రికెటర్లు కూడా బన్నీ డైలాగులను ఇమిటేట్ చేశారంటే.. అర్జున్.. పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో మోస్ట్ ప్రామినెంట్ యాక్టర్ అయిన అల్లు అర్జున్ సీక్రెట్ల గురించిన విషయం ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది.
ఎవరికైన పర్సనల్ గా కొన్ని పర్సనల్ సీక్రెట్లు ఉంటాయి. వాటికి చాలా దగ్గరి వ్యక్తులతోనే పంచుకుంటారు. ఈ క్రమంలో బన్నీకి కూడా కొన్ని సీక్రెట్లు ఉన్నాయట. వాటిని ఒకరితోనే పంచుకునేవాడట. అతను ఎవరో కాదు. తన తమ్ముడు అల్లు శిరీష్. తాజాగా అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోకు హాజరైన శిరీష్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు.
బన్నీ సీక్రెట్లన్నీ తనకు చెబుతాడని, అయితే నేను వాటికి ఎవరితో కూడా పంచుకోలేదని చెప్పాడు శిరీష్. చివరికి తన వదినమ్మ మెడ మీద కత్తి పెట్టి.. చెప్పమన్నా.. తాను చెప్పబోనని ఈ సందర్భంగా శిరీష్ సరదాగా చెప్పుకొచ్చాడు. అయితే బన్నీ సీక్రెట్లు ఏమై.. ఉంటాయని ఆయన ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.