
చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. గర్భం దాల్చిన తర్వాత పూర్తిగా సినిమాకు విరామం ప్రకటించింది కాజల్. గత ఏప్రిల్ 19న మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. తన కొడుకు ఆలనా పాలనలోనే మునిగిపోయింది. అతడికి నీల్ కిచ్లు అనే పెట్టుకున్నారు కాజల్ దంపతులు.
అయితే ఇప్పుడు దాదాపు ఏడాది విరామం తర్వాత కాజల్ షూటింగ్స్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. భారతీయుడు- 2 సినిమాలో ఆమె కీలక పాత్రలో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు చివరి వారం నుంచి ఆ సినిమా షూటింగ్స్ లో కాజల్ పాల్గొనే అవకాశం ఉందట.
ఇప్పటి నుంచి వరుస సినిమాలు చేయాలని కాజల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వియాన్ని తన మేనేజర్లకు కూడా చెప్పిందట. సినిమాలే కాదు.. ఓటీటీ ప్రాజెక్ట్ కు కూడా ఓకే చెప్పాలని చూస్తోంది. ప్రసవం తర్వాత శరీరంలో వచ్చిన మార్పలను సరి చేసుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె నాజూకైన ఫొటోలను షేర్ చేస్తూ.. అలరిస్తోంది ఈ భామ.