
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ హవా – ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతి మహిళ
అమెరికా ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే. రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. ఉషా చిలుకూరి విశాఖ వాసులకు బంధువు. గతేడాది వరకూ విశాఖలో సుపరిచిత సెంచూరియన్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్గా సేవలు అందించిన శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. అమెరికా ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్ ఎన్నికైన నేపథ్యంలో ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు ఒక్కసారిగా మళ్లీ మార్మోగిపోతోంది. ఉషకు విశాఖపట్నంలో బంధువులు ఉన్నారు. 90ఏళ్ల వయస్సులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలి వరుస అవుతారు. తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిన శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి కొన్నేళ్ల కిందట మృతి చెందారు. సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కుమార్తే ఉష.