
రాజోలు జనసేన MLA దేవా వరప్రసాద్ ఆవేదన – “కూటమి ప్రభుత్వంలో నాకు ఒక్క రూపాయి వర్క్ లు కూడా ఇవ్వట్లేదు!”
రాజోలు: ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం జనసేన ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపుతోందని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తనకు ఒక్క రూపాయి విలువైన పనులు కూడా కేటాయించలేదని ఆయన ఆరోపించారు.
స్వయంగా జనసేన క్యాడర్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన, “టీడీపీకి చెందిన నేతలకు రూ. 3.5 కోట్ల విలువైన పనులను కేటాయించగా, జనసేన నాయకులకు కేవలం రూ. 6 లక్షల పనులు మాత్రమే మంజూరు చేశారు. ఇది స్పష్టమైన వివక్ష” అని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన అధికారంలో భాగం అయినప్పటికీ, తమ ఎమ్మెల్యేలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపిస్తూ, “ఇలా కొనసాగితే జనసేన ఎమ్మెల్యేలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయగలరు?” అని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై ఎలా స్పందిస్తారు? కూటమి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంటుందా? అన్నది వేచిచూడాల్సిన విషయం.
Also read:
https://deccan24x7.in/telugu/fuel-price-hike-andhra-pradesh-ysrcp-tdp/