
Pawan kalyan against ysrcp
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీధి రౌడీ అవతారమెత్తారు. ఆవేశంతో ఊగిపోతూ.. చిల్లర భాషతో దూషిస్తూ.. చంపేస్తా, నరికేస్తా అంటూ వైసీపీపై రంకెలు వేశారు. మాటకోసారి ‘కొడకల్లారా’ అంటూ జుగుప్స కలిగించే భాషతో రెచ్చిపోయారు. రాజకీయమంటే తనకు బాధ్యత అంటూ గతంలో చెప్పిన డైలాగ్స్‌ను మర్చిపోయినట్లున్నారు. అటు తిరిగి, ఇటు తిరిగి వైసీపీని బూతులు తిట్టడమే తప్ప ఇవాళ్టి మంగళగిరి కార్యక్రమంలో పవన్ ఏం మాట్లాడారో.. ఏం చెప్పారో తనకే తెలియదు.
ఇదేనా సిద్దాంత రాజకీయం..?
నేను చేసేది సిద్ధాంత రాజకీయమని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఆ సిద్ధాంతామేంటో చెప్పకుండా వట్టి రాద్ధాంతానికే పరిమితమయ్యారు. వైసీపీ శ్రేణులు తనను ప్యాకేజీ స్టార్ అంటున్నారని… అలా అనేవాళ్లను చెప్పు తీసుకుని పళ్లు రాలగొడుతానని వ్యాఖ్యానించారు. చెప్పు తీసి చూపించి మరీ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘అరెయ్ ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, వైసీపీ గూండాల్లలారా..’ అంటూ నోరుపారేసుకున్నారు. ‘ఒంటిచేత్తో వస్తాం.. మెడ పిసికి తొక్కి కొంద నొక్కేస్తాం… భాష రాదానుకుర్రా నాకు… మాట్లాడితే మూడు పెళ్లిళ్లంటారు.. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసుల్లారా.. బూతుల పంచాంగం చెప్పే ప్రతీ కొడుకుని నిలుచోబెట్టి తోలు ఒలిచేస్తా… యుద్దానికి సిద్ధం.. రాడ్లతో రమ్మంటారా, హాకీ స్టిక్కులతో రమ్మంటార్రా.. ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యే గూండా కొడుకులు వస్తారో రండ్రా..’ అంటూ మాట్లాడారు.
పవన్ కల్యాణ్ ముసుగు తొలగిందా..! :
పవన్ తన ప్రసంగంలో జనసేన చాలా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తుందని చెప్పడం విడ్డూరం. ఓవైపు రెచ్చగొట్టే ప్రసంగాలతో జనసేన కార్యకర్తలను వైసీపీపైకి ఉసిగొల్పేలా మాట్లాడుతూ.. మరోవైపు తమది చాలా సమన్వయంతో ముందుకెళ్లే పార్టీ అని పవన్ కల్యాణ్ చెప్పుకోవడం హాస్యాస్పదం. తనను ప్యాకేజీ స్టార్ అంటున్నారని అంతలా ఫ్రస్టేట్ అయిన పవన్ కల్యాణ్… ఆ వెంటనే చంద్రబాబుతో భేటీ అవడం గమనార్హం. చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని వైసీపీ విమర్శిస్తే అంతలా బాధపడిపోతున్న పవన్ కల్యాణ్… రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నామని మళ్లీ చంద్రబాబుతో చేతులు కలపడం దేనికి సంకేతం. దీన్నిబట్టి పవన్ కల్యాణ్ వెనుక చంద్రబాబు ఉన్నాడనే విషయం బట్టబయలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.