తిరుపతి: జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ విషయంలో న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలి లక్ష్మి సోమవారం అరెస్ట్ అయ్యారు. లక్ష్మి, కిరణ్ రాయల్ చేసిన అక్రమాలపై ఆధారాలు ప్రదర్శిస్తూ పత్రికా సమావేశంలో ఆగడాలను బహిర్గతం చేశారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో రాజస్థాన్ పోలీసులు రంగప్రవేశం చేసి చెక్‌బౌన్స్ కేసులో లక్ష్మిని అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం, కిరణ్ రాయల్ విషయంలో కీలక మలుపులు తీసుకోవడం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. కిరణ్ రాయల్‌ను కాపాడేందుకు ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి కూటమి నాయకులు, కిరణ్ రాయల్‌ను రక్షించడానికి లక్ష్మి అరెస్ట్ చేయించారు.