
గత కొన్నిరోజులుగా తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు ఏపీ లో దుమారం లేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తన రాజకీయ లబ్ది కోసం మా పార్టీ పైన చేసిన దుష్ప్రచారమని దీనికి ప్రాయశ్చిత్తంగా ప్రభుత్వం అన్ని గుళ్ల ప్రక్షాళన చెయ్యాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతే కాకుండా పార్టీ కార్యకర్తలందరిని ఇందులో భాగస్యామ్యం కావాలని కోరుతూ తానూ కూడా 28 వ తేదీన తిరుపతి చేరుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని తెలిపారు
ఐతే ప్రభుత్వం దీనిని నిరాకరిస్తూ ఉదయం నోటీసులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఐన మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతి కి రావడం మంచిది కాదని, భద్రతా పరమైన సమస్యలు చోటు చేసుకునికే సంభవం ఉంటుందని గ్రహించి అనుమతిని నిరాకరిస్తున్నట్టు లేఖలో పోలీసులు పేర్కొన్నారు
ఈ లేఖకు స్పందిస్తూ వై ఎస్సార్ సీపీ పార్టీ X వేదికగా సమాధానం ఇచ్చింది. తిరుపతి కి వచ్చే వైఎస్సార్ సీపీ నాయకులకి 30 ఆక్ట్ ప్రకారం పోలీసు నిబంధనలు విధిస్తు వారికి లేఖ రాసినట్టు తెలిపారు
‘కూటమి సర్కార్ ఆంక్షలు విధిస్తోంది. 30 యాక్ట్ అమలులో ఉందంటూ వైయస్ఆర్సీపీ నాయకులకు అర్ధరాత్రి నుంచే నోటీసులు జారీ చేస్తోంది’
ఇంతకు ముందే తెలుగు దేశం నాయకులు జగన్ తిరుమల దేవస్థానానికి రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని కూడా కోరిన విషయం అందరికి తెలిసిందే. ఇలాంటి సమయంలో జగన్ తిరుమల రాకని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి జగన్ ఎలా స్పందిస్తారో, రేపు ఎం జగగనుందో వేచి చూడాలి..