
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. హామీలు నెరవేర్చకుండా మోసపూరితమైన విధానాన్ని అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు.
తల్లికి వందనం అంటూ ప్రతీ తల్లికి, పిల్లలకు రూ.15వేలు ఇస్తామన్న మాట ఏమైంది? తల్లుల కోసం మేము అమలుచేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని నిలిపివేసి, మీ హామీ అమలులో విఫలమై, చివరికి ఈ ఏడాది ఇవ్వబోమని చెప్పడం ఎంత అన్యాయం ? అని జగన్ ప్రశ్నించారు.
రైతు భరోసా పేరు చెప్పి మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామని చెప్పినా, ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసినా ఒక్క పైసా కూడా అందించలేదు. వైయస్సార్సీపీ పాలనలో ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.13,500 చొప్పున రూ.34,378 కోట్లు అందించాం. మీ హామీలు అన్నీ మోసపూరితంగా మిగిలిపోయాయి” అని జగన్ ఎత్తిచూపారు.
నిరుద్యోగులకు భృతి, మహిళలకు ఆర్థిక సాయం, వాలంటీర్లకు న్యాయం అన్నీ మీ పాలనలో మోసపూరిత హామీలుగానే మిగిలిపోయాయి. ప్రతి అడుగులోనూ ప్రజలపై భారం వేస్తూ, ఛార్జీలతో బాదుతూ, స్కాంలతో మీ మోసపూరిత పాలనకు నిదర్శనం ” అని విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిలబడి, మీ హామీల అమలుకు ఆవాజ్ వేస్తుంది. ప్రజలను మోసపూరిత హామీలతో మభ్యపెట్టిన మీ తీరుపై ప్రజల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది” అని జగన్ తన ట్వీట్లో స్పష్టం చేశారు.
Read More on Jagan’s Tweet: Click Here