
somu veerraju
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే బాధ్యత తమదే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కర్నూలు అభివృద్ధిని పాలకులు విస్మరించారన్నారు. రాయలసీమ నుంచి పని చేసిన సీఎంలు ఎవరు కూడా.. కర్నూలు అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. ప్రొద్దుటూరులోని రాయల్ కౌంటీలో బీజేపీ రాయలసీమ జోనల్ స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇతర రాజకీయ పార్టీలన్నీ పోలవరం తప్ప.. వేరే విషయం గురించి మాట్లాడటం లేదన్నారు. సీమ అభివృద్ధిపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీమలోని హంద్రీనీవా, గాలేరు నగరి పూర్తిచేయాలని ఎందుకు మాట్లాడటంలేదు.
రూ.500 కోట్లతో సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేస్తే రాయలసీమకు నికరజలాలు సకాలంలో తీసుకురావచ్చన్నారు. ఈ అలుగు గురించి ఏ పార్టీ మాట్లాడకపోవడం దారుణం అన్నారు. ఇది నిజంగా రాయలసీమకు అన్యాయం చేసినట్లే అవుతందన్నారు. వైపీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ దుర్వినియోగం చేస్తోందన్నారు.