
pawan kalyan
అక్టోబర్ 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించాలని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే తాజాగా పవన్ బస్సు యాత్రను వాయిదా వేసినట్లు వాయిదా వేస్తన్నాయి. ఇంతకీ ఆయన బస్సు యాత్రను ఎందుకు వాయిదా వేశారు. దీనికి కారణం ఏమై ఉంటుంది?
జనసేన విస్తరణ, ఎన్నికల వ్యూహంలో భాగంగా పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అది సమయం చూసుకొని యాత్ర చేపట్టాలని చూస్తున్నారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతాడు అన్న ప్రచారం నేపథ్యంలో పవన్.. బస్సు యాత్రకు వ్యూహ రచన చేశారు. బస్సు యాత్ర మొదలు పెట్టి.. ఎన్నికలు అయ్యే వరకు ప్రజల్లోనే ఉండొచ్చని ఆయన ఆలోచించారు. అయితే తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే.. జగన్ ఇప్పట్లో ఎన్నికలకు పోయేలా లేరు. దీంతో పవన్ కల్యాణ్ బస్సు యాత్రను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
పక్కా ప్రణాళిక..
పవన్ కల్యాణ్ బస్సు యాత్రలో పక్కా ఎన్నికల వ్యూహం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వాయిదా కూడా ప్రణాళిక ప్రకారమే వేసినట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకో 19నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచే పవన్ కల్యాణ్ ప్రజల్లో ఉండటం కష్టం. ఎందుకంటే.. ఆయన ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆయన కార్యక్షేత్రంలోకి వెళ్తే.. మళ్లీ సినిమాలు చేయడం కష్టం. అందుకే.. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలను వరుసబెట్టి పూర్తి చేసే ఉద్దేశంలో పవన్ ఉన్నారు. ఇంకో ఆరు నెలల్లో ఆ సినిమాలు అన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలను పూర్తి చేయడం వల్ల.. ఆర్థికంగా కూడా కాస్త చేయూతగా ఉంటుందని పవన్ ఆలోచన. ఆ తర్వాత సంవత్సరం పాటు నిరంతరం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు పవన్ కల్యాణ్. అంతుకే బస్సు యాత్రను ఎన్నికల ఏడాదిలోనే చేపట్టాలని జనసేనాని ఆలోచిస్తున్నారు.
ఆదివారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే లీగల్ సెల్ సమావేశంలో అధినేత పవన్ కల్యాణ్.. బస్సు యాత్రపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.