
amaravathi
అమరావతి రైతుల పేరుతో చేస్తున్న మహాపాదయాత్ర 2.0.. రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ పాదయాత్రపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? అది నిజంగా ప్రజల్లోంచి పుట్టిన ఉద్యమమా? అధికార వికేంద్రీకరణపై ఎందుకు అక్కసును వెళ్లగక్కుతున్నారు? ఒకే ప్రాంతంలోనే అభివృద్ధి జరగాలి. మిగతా ప్రాంతాలను గాలికి వదిలేయాలని కుట్ర చేస్తున్నది టీడీపీ కాదా? వికేంద్రీకరణ ప్రాముఖ్యతపై శివరామకృష్ణన్ కమిషన్ ఏం చెప్పింది?
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సినది నూతన నగరం కాదు. ప్రాంతాల మధ్య సమతుల్యత. రాష్ట్ర వనరులను, శక్తి సామర్థ్యాలను రాజధాని ప్రాజెక్టు కోసం వెచ్చించడం అంటే ఆత్మహత్యతో సమానమే.’
– శివరామకృష్ణన్ కమిషన్ చెప్పిన మాటలు
అమరావతి రైతుల పేరుతో ‘మహాపాదయాత్ర 2.0’కు కొందరు శ్రీకారం చుట్టారు. ఆ పాదయాత్రకు టీడీపీతోపాటు కొన్ని రాజకీయ పార్టీలు వత్తాసు పలుకుతున్నాయి. రాజధాని అమరావతిలోనే ఉండాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచి.. అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయాలనేది వీరి డిమాండ్ గా కనిపిస్తోంది. అయితే వారి ఆశయాలకు విరుద్ధంగా, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీని ద్వారా అధికార వికేంద్రీకరణ జరుగుతుందనేది జగన్ ప్రభుత్వం ఆలోచన. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ప్రభుత్వ సదుద్దేశాన్ని వ్యతిరేస్తూ వస్తున్నారు.
చంద్రబాబు కుట్ర..
మూడు రాజధానుల ప్రతిపాదనలను, అధికార వికేంద్రీకరణను వ్యతిరేకించడం వెనక పెద్ద చంద్రబాబుతో కుట్ర దాగి ఉందనేది బహిరంగ రహస్యం. రాజధాని పెడుతున్నామని లీకులిచ్చి భారీ భూస్కామ్ కు తెరలేపారు చంద్రబాబు. అమరావతిలో అసైన్డ్ భూముల స్కామ్ జరిగిందని సీఐడీ దర్యాప్తులో బయడపడటం గమనార్హం. ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు జరిగాయి. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక.. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు సీఐడీ వెల్లడించింది. చంద్రబాబు తన బినామీలు, తమ పార్టీ నేతల భూములకు ప్రయోజనం చేకూర్చేలా రాజధానిని ఏర్పాటు చేశారని దర్యాప్తులో తేటతెల్లమైంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. 4,070 ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్లో కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
జగన్ ప్రభుత్వం వచ్చాక రాజధాని అక్రమాలు బయట పడ్డాయి. చంద్రబాబు రాజధాని రైతులను, రాష్ట్ర ప్రజలను ఎలా బురిడీ కొట్టించాడో దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాయి.
రాజధానికి దూరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు..
రాజధాని కోసం చంద్రబాబు సర్కారు తీసుకున్న భూమి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిందే. వారి నుంచి పొలాలను తీసుకొని.. రాజధానికి దూరంగా వారికి ప్లాట్లు ఇచ్చారు. నిమ్నవర్గాలకు అభివృద్ధి ఫలాలు అందకూడదనే చంద్రబాబు ప్రభుత్వం రాజధాని దూరం చేసిందనే చెప్పాలి. రాజధాని నుంచి వారిని తరిమేసి.. ఒక వర్గానికి కట్టబెట్టడం కోసమే టీడీపీ.. మహాపాదయాత్ర 2.0ను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
వాళ్లు నిజంగా రైతులేనా?
మహాపాదయాత్ర 2.0లో పాల్గొంటున్నది నిజంగా రైతులా? అంటే కాదనే చెప్పాలి. టీడీపీకి చెందిన కొందరు భూస్వాములు ఈ పాదయాత్ర వెనుక ఉన్నారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పాదయాత్రకు దూరంగా ఉన్నాయి. అమరావతిని చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చగా.. సీఎం జగన్ అయ్యాక ఆ పుట్టను పెకిలిస్తుండంతో సంతోషిస్తున్నారు. తాము భూములను కోల్పోవడానికి చంద్రబాబే కారణమని భావించి.. మహాపాదయాత్ర 2.0ను వారు కూడా వ్యతిరేకిస్తున్నారు.
అమరావతి మరో హైదరాబాద్ కావాలా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది హైదరాబాద్ ఒక్కటే. విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు పోయింది. కొత్త రాష్ట్రానికి చెప్పుకోదగ్గ నరగం లేని పరిస్థతి. అభివృద్ధి ఒకే దగ్గర కేంద్రకృతం కావడం వల్ల.. ఎన్ని అనర్థాలు జరిగాయో హైదరాబాద్ మనకు ఒక గుణపాఠం. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే తప్పు చేయకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మూడు రాజధానులు తీసుకొస్తే.. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జగన్ ఆలోచించారు. అయితే జరిగితే జగన్ ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోనన్న ఉద్దేశంతో.. చంద్రబాబు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు. చంద్రబాబు రచించిన కుట్ర రచనకు ఇతర రాజకీయ పార్టీలు సహకరించడం బాధాకరం.