
ఐఫోన్ 14 సిరీస్ను లాంచ్ చేసేందుకు అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ సన్నద్ధమవుతోంది. అధునాత ఫీచర్లతో ఈ కొత్త మోడల్ ను యాపిల్ తీసుకొస్తోంది. ఐఫోన్ 13కు అదనపు హంగులు జోడిస్తూ.. సరికొత్త ఫీచర్లతో ఐఫోన్ 14ను రూపొందించింది సంస్థ. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ , ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ వెర్షన్స్ ను యాపిల్ లాంచ్ చేయనుంది.
ప్రతీ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ కొత్త సిరీస్ను లాంచ్ చేయడం యాపిల్ ఆనవాయితీగా కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని పాటించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఐఫోన్14 లాంచ్ అయ్యే తేదీ లీక్ అయ్యింది. సెప్టెంబర్ 7వ తేదీన లాంచ్ అవుతుందని బ్లూమ్బర్గ్ వెల్లడించింది.
చాలా దేశాల్లో కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తగ్గని కారణంగా.. ఈ సారి కూడా వర్చువల్ గానే లాంచ్ ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది. 7వ తేదీన లాంచ్ అయితే.. అదే నెల 16వ తేదీన అమ్మకాలు మొదలవుతాయని బ్లూమ్బర్గ్ పేర్కొంది.