
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసినట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి.
ప్రథమ సంవత్సర ఫలితాల్లో జనరల్‌లో 35 శాతం, ఒకేషనల్‌లో 42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జనరల్‌లో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు సంబందించిన దరఖాస్తులను సెప్టెంబర్ 10వ తేదీ వరకూ స్వీకరిస్తామని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలు అధికారిక వెబ్ సైట్ లో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు జనరల్ లో 3,28,831 మంది, ఒకేషనల్ లో 37,712 మంది మొత్తం 3,66,543 మంది హాజరయ్యారని తెలిపారు.