
infosys
వైజాగ్ ను ఐటీ హబ్ గా మార్చే ప్రయత్నానికి మరో అడగు పడింది. వైజాగ్ లో అక్టోబర్ 1 నుంచి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మధురవాడ ఐటీ సెజ్‌లోని మహతి సొల్యూషన్స్ప్రాంగణంలో ఇన్ఫోసిస్ ఆఫీస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
మొదట 1,000 మంది ఉద్యోగులతో మొదలు పెట్టి.. క్రమంగా 3 వేల మంది ఉద్యోగులకు విస్తరించనున్నారు. టాలెంట్ పూల్‌ను చేరుకోవాలనే ప్రణాళికలో భాగంగా ఇన్ఫోసిస్.. కోయంబత్తూర్, వైజాగ్, కోల్‌కతా, నోయిడా వంటి టైర్-II నగరాల్లో తన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇండోర్, నాగ్‌పూర్‌లలో చిన్న కేంద్రాలను కలిగి ఉండగా, ఇప్పుడు వైజాగ్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది.
మరిన్ని కంపెనీలు కూడా వైజాగ్ లో తమ ప్లాంట్లను ఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త కంపెనీల ఏర్పాటుకు సహకరిస్తోంది. విశాఖలో ఐటీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అంతే కాకుండా.. విశాఖను రాజధానిగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కొత్త కంపెనీలు మరింత ఉత్సాహంతో విశాఖను తమ కార్యక్షేత్రంగా చేసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి.
ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు తన కార్యకలాపాలను వైజాగ్ లో కొనసాగిస్తున్నాయి. తాజాగా దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కూడా తమ ఆఫీస్ ను తెరిచింది. దీంతో మరి బడా సంస్థలు విశాఖకు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.