
cm jagan
బాల్య వివాహాలను నివారించడంతో పాటు పిల్లల చదువును ప్రోత్సహించడం కోసం ‘వైఎస్సార్ కల్యాణమస్తు’, ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమలులోకి రానున్నాయి. ఈ పథకాలకు సంబంధించిన వెబ్ సైట్ను సీఎం జగన్ ప్రారంభించారు.
ఈ పెళ్లి కానుకను అందుకోవాలంటే అమ్మాయి కనీసం పదో తరగతి చదివి ఉండాలన్న నిబంధనను విధించారు. పాఠశాలల్లో బాలికల శాతాన్ని పెంచేందుకు వీలుగా ఈ నిబంధనను చేర్చారు. తద్వారా ఈ పథకాలు బాలికా విద్యను ప్రోత్సహిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అర్హత సాధించాలంటే వధువుతో పాటు వరుడు కూడా కనీసం పదో తరగతి దాకా చదువుకుని ఉండాలి. అంతేగాకుండా వధువు వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలన్న షరతునూ విధించారు.
ఇదీ ప్రభుత్వం అందించే సాయం..
- ఎస్సీలకు రూ.1,00,000
- కులాంతర వివాహం చేసుకునే ఎస్సీలకు రూ.1,20,000
- ఎస్టీలకు రూ.1,00,000
- కులాంతర వివాహం చేసుకునే ఎస్టీలకు రూ.1,20,000
- బీసీలకు రూ.50,000
- కులాంతర వివాహం చేసుకునే బీసీలకు రూ.75,000
- మైనారిటీలకు రూ.1,00,000
- దివ్యాంగులకు రూ.1,50,000
- నిర్మాణ కూలీలకు రూ.40,000
గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం పేదింటి ఆడపిల్లలకు ఇచ్చే పెళ్లి కానుకను వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీగా పెంచింది. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తున్న జగన్ ప్రభుత్వం ఆ దిశగా వేసిన అడుగు ఇది.