
dharmana prasada rao
విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం శ్రీకాకుళంలో నిర్వహించిన ’మన రాజధాని – మన విశాఖ‘ సదస్సులో మంత్రి ధర్మాన మాట్లాడారు. ఆర్థిక లోటుతో ఉన్న మన రాష్ట్రానికి అతి పెద్ద రాజధాని అవసరం లేదని శివరామకృష్ణన్ కమిటీ సలహా ఇచ్చిందని గుర్తు చేశారు. పరిస్థితులను బట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని గతంలోనే డిమాండ్ వచ్చిందన్నారు.
అభివృద్ధిలో అసమానత ఉంటే అస్థిరత ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని కోసం రహస్యంగా 3500 జీవోలు ఇచ్చారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రజల్లో సీరియస్ నెస్ పెంచేందుకే తాను రాజీనామా చేస్తానని అన్నట్లు తెలిపారు.
విశాఖ రాజధాని అవకాశం ఇప్పుడు పోతే మళ్లీ రాదని… నివేదికలు, నిపుణులు చెప్పినట్లే సీఎం జగన్ చర్యలు తీసుకుకుంటున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఏం స్టడీ చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని మంత్రి ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు. మొత్తంగా విశాఖ కార్యనిర్వాహక రాజధానిపై మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు హీటెక్కిస్తున్నాయి.