
హైదరాబాద్ శివార్లలోని జన్వాడలో లగ్జరీ ఫామ్‌హౌస్‌లో వీఐపీ రేవ్ పార్టీపై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీని BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి కేటీఆర్ యొక్క బావమరిది రాజ్ పాకాల నిర్వహించినట్లు సమాచారం. ఘటనా స్థలంలో అధికారులు విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రైడ్ అనంతరం పార్టీకి హాజరైన వారిని నార్కోటిక్ టెస్టులు చేయగా, ఒక వ్యక్తికి కొకైన్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే ఘటన స్థలంలో డ్రగ్స్ లాంటి పదార్థాలు దొరకలేదని పోలీసులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ సంఘటనపై కొంతమంది రాజకీయ విశ్లేషకులు విదేశీ మద్యాన్ని సేవించడం తప్పు ఏమిటి అని ప్రశ్నిస్తుండగా, మరి కొందరు ఇది కేటీఆర్ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుతంత్రంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో, పోలీసులు విచారణ ఇంకా కొనసాగుతోందని, అది పూర్తయిన తర్వాత పూర్తి ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.
ఇది రాజకీయ కుట్ర లేక అసలు నిజాలు ఇంకా భయటకు వస్తాయా అని చూడాలి.