
చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ కంపెనీ తన ఉద్యోగులకు అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇచ్చింది. వార్షిక బోనస్‌గా రూ.70 కోట్లు అందజేస్తూ, అందుకు వినూత్నమైన ఛాలెంజ్ పెట్టింది.
కంపెనీ 60 నుంచి 70 మీటర్ల పొడవైన టేబుల్‌పై ఈ మొత్తాన్ని ఉంచి, ఉద్యోగులను 30 టీమ్‌లుగా విభజించింది. ప్రతీ టీమ్ నుంచి ఇద్దరేసి సభ్యులు వచ్చి, కేవలం 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడతారో అంత మొత్తాన్ని తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. ఈ వినూత్న బోనస్ పద్ధతికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గత ఏడాది 2023 జనవరిలో కూడా, ఇదే విధంగా హెనన్ మైన్ క్రేన్ సంస్థ తన ఉద్యోగులకు రూ.70 కోట్ల బోనస్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులకు ఇచ్చే ఈ ప్రత్యేకమైన బోనస్ విధానం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.