
hansika motwani
‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. దక్షిణాదిన టాప్ హీరోగా ఎదిగింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంన్న ఆమె.. తాజాగా తాను పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తనకు కాబోయో భర్తను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. ఇంతకీ హన్సికను పెళ్లి చేసుకోబోయేది ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
హన్సికకు పెళ్లి కుదిరిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. హన్సిక డేటింగ్ చేస్తోన్న వ్యక్తి తోనే పెళ్లి ఖాయం అయిందని, పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు చెక్ పెడుతూ.. హన్సిక స్వయంగా తన పెళ్లికి గురించి వెల్లడించింది.
చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన సోహైల్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు హన్సిక తెలిపింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద అతడితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘ఇప్పుడు.. ఎప్పడూ.. ప్రేమిస్తూనే ఉంటా’ అని దానికి జత చేసింది.
సోహైల్ ప్రపోజల్ ను అంగీకారం చెబుతూ.. అతడిని ప్రేమగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.