
ycp
కుటుంబం, దేశం ప్రగతిపథంలో పురోగమించటంలో మహిళలే కీలకమన్న విషయాన్ని ప్రభుత్వాలు.. వారి సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విధంగానే ముందుకుపోతోంది. మహిళల కోసం దేశంలోనే అత్యుత్తమ సంక్షేమ పథకాలను అందజేస్తోంది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా.. అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలను అందజేస్తోంది. తద్వారా రాష్ట్రంలోని మహిళలు సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం మద్ధతుతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రత సాధిస్తున్నారు. ఇంతకీ ఆ పథకాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
వైఎస్సార్ ఆసరా@రూ.12,758కోట్లు
రాష్ట్రంలో మొత్తం 1.03 కోట్ల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. డ్వాక్రా సంఘాలకు ఉన్న బ్యాంకు రుణాలను నేరుగా వారికే చెల్లిస్తూ ‘వైఎస్సార్ ఆసరా’ పథకం తీసుకొచ్చారు సీఎం జగన్. రూ.25వేల 517 కోట్లను అప్పును వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు అందజేసేందుకు పూనుకుంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటికే రెండు విడతల్లో 12,758.28 కోట్లను చెల్లించింది. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఇచ్చే డబ్బు తిరిగి చెల్లించక్కర్లేదు.
ఈబీసీ నేస్తం@రూ.589కోట్లు
ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల కోసం వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం పథకాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. మహిళల ఖాతాల్లోకి మొదటి విడతగా రూ.589 కోట్లు నగదు జమ చేశారు.
అమ్మ ఒడి
పేదరికం కారణంగా ఎవరూ బడి మానేయకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం చొప్పున అందిస్తున్నారు జగన్. 2019–20 విద్యా సంవత్సరంలో రూ. 6,349.53 కోట్లు, 2020–21లో రూ. 6,673.00 కోట్లు, 2021–22లో రూ. 6,595.00 కోట్లు వెచ్చించింది జగన్ ప్రభుత్వం.
వైఎస్సార్ సున్నా వడ్డీ
సున్నా వడ్డీ కింద ప్రభుత్వం మొదటి ఏడాది రూ.1,258 కోట్లు, రెండో ఏడాది రూ.1,096 కోట్లు, మూడో ఏడాది రూ. 1,261 కోట్లు అందజేసింది. వడ్డీ పథకం ద్వారా దాదాపు కోటి 2లక్షల 16 వేలమందికి పైగా లబ్ధి పొందారు.
వైఎస్సార్ చేయూత
45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.75 వేలు అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ పథకం పేరుతో ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో అందజేయనున్నారు. ఇప్పటికే మూడు విడతలు అందజేశారు.
అదనపు తోడ్పాటు
సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటుతో పాటు బ్యాంకు రుణాల ద్వారా అందజేసిన డబ్బుతో వారికి శాశ్వత జీవనోపాధి కల్పనకూ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మహిళలు వారి గ్రామాల్లో కిరాణా షాపులు వంటి చిరు వ్యాపారాలను ప్రారంభించుకోవడానికి ముందుకొస్తే, వారికి హోల్సేల్ మార్కెట్లో దొరికే ధర కన్నా తక్కువకే సరుకులను సరఫరా చేసేందుకు వీలుగా మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.