
kodali nani on pawan kalyan lokesh and cbn
మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘నా కొడుకల్లారా..’ అంటూ వైసీపీపై ఊగిపోయారు. చెప్పులతో కొడుతానంటూ చేతిలో చెప్పు చూపిస్తూ వీధి రౌడీ తరహాలో వ్యవహరించారు. ఇక నిన్నటికి నిన్న టీడీపీ నేత నారా లోకేష్ సీఎం జగన్‌ను ఉద్దేశించి ‘పిల్లి నా కొడుకు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలు ఉపయోగిస్తున్న ఈ భాష, వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలపై అధికార వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు.
లోకేష్‌కు సిగ్గూ, శరం లేదు : కొడాలి నాని
లోకేష్ లాంటి కొడుకు ఉండకూడదని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ కోరుకుంటారని… ఆఖరికి చంద్రబాబు కూడా అదే అనుకుంటున్నాడని కొడాలి నాని విమర్శించారు. అందుకే చంద్రబాబు నాయుడు తనను గెలిపించాలంటూ పక్క పార్టీ వాళ్ల బూట్లు నాకుతున్నాడని ధ్వజమెత్తారు. ‘జయంతికి, వర్థంతికి తేడా తెలియకపోయినా ఫర్వాలేదు కానీ.. పిల్లికి, పులికి తేడా తెలియకపోతే … ఆ పులికే ఆహారం అవుతావు. జగన్ మోహన్ రెడ్డి గారు పులి. ఆయన పులి కాబట్టే మంగళగిరిలో నువ్వు ఆహారం అయిపోయావు. పనికిమాలిన దద్దమ్మ అయ్యావు.’ అంటూ లోకేష్‌పై నాని ఫైర్ అయ్యారు. జగన్ ప్యాలెస్ నుంచి బయటకొస్తే.. రోడ్ల వెంట షాపుల తలుపులు, కిటికీలు మూయిస్తారని… మూసేసిన తలుపులు, కిటికీలకే ఆయన చేతులు ఊపుతుంటారని లోకేష్ చేసిన కామెంట్లకు నాని కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి మాటలు మాట్లాడేందుకు నారా లోకేష్‌కు సిగ్గూ, శరం లేదన్నారు. పెద్దవాళ్లయినా.. చిన్నవాళ్లయినా.. జగన్ ఎక్కడికెళ్లినా అందరికీ రెండు చేతులతో నమస్కారం చేస్తారని అన్నారు. ఆయన కిటికీలు, తలుపులకు చేతూలు ఊపారా? నువ్వు చూశావా అంటూ లోకేష్‌ను ప్రశ్నించారు. లోకేష్ పనికిమాలిన పప్పు అని… అద్దం ముందు నిలబడి తనకు తానే చేతులు ఊపుకుంటాడని విమర్శించారు. అలా మాట్లాడకూడదు.. ఇలా తిట్టకూడదంటూ ప్రతిపక్షాలు తమకు నీతులు వల్లిస్తుంటారని… కానీ వాళ్లు ముఖ్యమంత్రిని తిడితే, చెప్పు చూపిస్తూ దూషిస్తే తాము స్పందించకూడదా అని ప్రశ్నించారు.
ఆ చెప్పులు దాచిపెట్టుకోండి : పవన్‌పై కొడాలి నాని
‘విశాఖ గర్జన కార్యక్రమం రోజే పవన్ కళ్యాణ్ విశాఖలో ర్యాలీ పెట్టి మంత్రులపై విమానాశ్రంలో దాడులు చేయించడం.. ఆ తర్వాత తీరిగ్గా బెజవాడ వచ్చి చెప్పులు చూపించడం… ఇవన్నీ ఎవరి డైరెక్షన్ లో జరుగుతున్నాయి.. ఉత్తరాంధ్ర, రాష్ట్ర ప్రజలు అమాయకులు కారు కదా… ఉత్తరాంధ్ర గర్జన గురించో, మూడు రాజధానుల అభివృద్ధి గురించో, వికేంద్రీకరణ గురించో ప్రజల్లో చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ దీన్ని మరుగున పడేసేందుకు కేవలం ఆ 29 గ్రామాల వాళ్లు, 33 ఎకరాల వాళ్లే రైతులు.. టీడీపీ, జనసేనవే రాజకీయాలనే చర్చను ముందుకు తీసుకొస్తున్నారు.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, ఉత్తుత్తి కొడుకు లోకేష్‌ను రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో దారుణాతి దారుణంగా, ప్రతిపక్ష పాత్రకు కూడా పనికిరాకుండా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీళ్లు ఉపయోగించిన భాష, చెప్పులు వాళ్లకే ఉపయోగపడుతాయి. ఆ చెప్పులు జాగ్రత్తగా దాచిపెట్టుకోమని పవన్ కల్యాణ్‌ను కోరుతున్నాను. 2024 ఎన్నికల కౌంటింగ్ రోజున.. ఆ చెప్పులతో ముందు తాను కొట్టుకొని.. ఆ తర్వాత తన స్థితికి కారణమైన చంద్రబాబును కొట్టాలి’ అంటూ కొడాలి నాని ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.
వాళ్లు రెచ్చగొట్టినా మేం రెచ్చిపోలేదే : కొడాలి నాని
జగన్ గారి మీద ఏదో ఒకటి బురద చల్లడమే కార్యక్రమమే తప్ప, ఆయన చేసే మంచి కార్యక్రమాలపై వీ డిబేట్ చేయరు. మూడు రాజధానుల మీద డిబేట్ జరగకూడదు.. కేవలం ముగ్గురు పెళ్లాల మీద మాత్రమే డిబేట్ జరగాలా.. విశాఖను రాజధానిగా చేయాలంటూ ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ గర్జన నిర్వహిస్తే… దాన్ని ఆదిలోనే పీక పిసికి చంపేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ దుర్మార్గపు ఆలోచన చేశారని మండిపడ్డారు. అమరావతి రైతుల యాత్ర గుడివాడకు వస్తే.. 800 మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పించామన్నారు. వాళ్ళు తొడలు కొట్టినా, రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోలేదని గుర్తుచేశారు. చివరాఖరికి జగన్ మోహన్ రెడ్డిగారు ఆడే ఫుట్ బాల్ గేమ్‌లో ఏ బాల్ అయినా ప్రత్యర్థులంతా చిత్తవక తప్పదని వ్యాఖ్యానించారు.