
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ పర్యటనలో భాగంగా గాంధీనగర్ బీఆర్టీఎస్ రోడ్లోని శ్రీ శృంగేరీ శారదా పీఠాన్ని సందర్శించారు. అక్కడ జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి స్వామీజీని కలుసుకుని ఆశీర్వచనం పొందారు.
ఈ పర్యటనలో వైయస్ జగన్తో పాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ విజయవాడ ఈస్ట్ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
స్వామీజీ ఆశీర్వచనంతో రాజకీయ, ఆధ్యాత్మిక రంగాల్లో విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తమైంది. ఈ పర్యటన స్థానికంగా విశేష ఉత్సాహాన్ని కలిగించింది.