కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామంలో శుక్రవారం ఏపీఐఐసీ ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భూములను రైతులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
రైతులు 100 ఎకరాల భూమిని కేటాయించి, గ్రామంలో రోడ్లు మరియు ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలను మల్లవల్లి గ్రామానికి పంపించారు. బాపులపాడు, నూజివీడు ప్రాంతాల్లో 20 మంది రైతులను గృహ నిర్బంధంలో పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.