
- మూడేళ్లలో ఏన్నో సంస్కరణలు తీసుకొచ్చాం
- గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్
- ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల అందజేత
చదవు విలువను తెలుసుకొని.. మారుతున్న ప్రపంచంలో మన పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని .. తమ ప్రభుత్వం విద్యారంగానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ అన్నారు. తరతరాలుగా చదువులు నేర్పుతున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జగన్. ఉపాధ్యాయులందరికీ ఒక శిఖరం లాంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు. ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతి స్ధాయికి ఎదిగిన ఆయన జీవితం ఆదర్శనీయం అన్నారు.
విజయవాడలో జగిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల అందజేశారు. తనను మెరుగైన జీవితంవైపు నడిపించిన తన గురువులకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. ఉత్తమమైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర కీలకం అన్నారు. ఏ దేశమైనా, ఏ జాతైనా, ఏ సమాజమైనా చదువు గొప్పదనాన్ని గురించి.. ఉపాధ్యాయులను గౌరవించాన్నారు. తాము కూడా అదే విధానాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పారు. గడిచిన మూడేళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు.
తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన సమీక్షల్లో విద్యాశాఖకు సంబంధించినవే ఎక్కువన్నారు సీఎం జగన్. మన రాష్ట్రంలోని పిల్లలు భవిష్యత్‌ను మార్చగలిగే గొప్పదైన అస్త్రం విద్య అన్నారు. అందుకే విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. చదువుల వల్ల మన పిల్లలకు ప్రయోజనం కలుగుతుందా ? లేక కేవలం పట్టా మాత్రమే వారి చేతిలోకి వస్తుందా ? అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు జగన్.
చదువుకు దూరమైన సామాజిక వర్గాల కోసం..
కొన్ని సామాజిక వర్గాలు వేల సంవత్సరాల పాటు చదువులకు దూరంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు స్వాతంత్య్రం తర్వాత చదవులో ప్రపంచంతో పోటీ పడలేని చదువుతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. దీన్ని మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ మార్పులు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావన్నారు. ఇవి ఉపాధ్యాయుల చేతిలో శిల్పాలుగా మారే పిల్లల భవిష్యత్తును మరింత మెరుగుపరుస్తాయన్నారు. భవిష్యత్ తరాలకు అవసరమైన చదువులు కోసం అడుగులు ముందుకు వేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు కార్పోరేట్ రంగాన్ని ఉద్దరించేవి కావన్నారు. అన్ని సామాజిక వర్గాల్లోని విద్యార్థులను ఉద్దేశించినవి అన్నారు.