
holydays
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు దసరా సెలవులు వచ్చేశాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు 1 నుంచి 6 వరకు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ (2022-23)లో దసరా హాలీడేస్ గురించి ముందుగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పని చేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. పాఠశాలలు తిరిగి అక్టోబర్ 7వ తేదీన పున ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ తెలిపింది.