
NARA LOKESH
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అధికార వికేంద్రీకరణపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ రెండింటిపై సీఎం జగన్ సుధీర్ఘ వివరణ ఇచ్చారు. అయితే సీఎం జగన్ చేసిన ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. సీఎం జగన్ పై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. జగన్ వివరణ, విజన్ కు పెద్ద నమస్కారం అంటూ ఎద్దేవా చేశారు. అసలు జగన్ కు వికేంద్రీకరణకు అర్థం తెలుసా అని ప్రశ్నించారు.
వికేంద్రికరణ అంటే.. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు, పామాయిల్ పంచడం కాదాన్నారు. గోదావరి వరదల సందర్భంగా తమకు ప్రభుత్వం సాయం అందలేదని ఏ ఒక్కరూ కూడా అనలేదని.. ఇది వికేంద్రీకరణ వల్లే సాధ్యమైందని సీఎం జగన్ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం అసెంబ్లీ లో సీఎం జగన్ ప్రసంగించిన వీడియోను వీడియోను పంచుకున్నారు.
అసెంబ్లీలో జగన్ ఎం చేప్పారంటే?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ధోకా ఏమీ లేదని సీఎం జగన్ అన్నారు. అవాస్తవాలను రాష్ట్ర ప్రజలు ఏవరు నమ్మనమ్మవద్దన్నారు. రాష్ట్ర అప్పులపై చంద్రబాబు రోజూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. విభజన నాటికి రాష్ట్రం రుణాలు రూ.1.26 లక్షల కోట్లు అని తెలిపారు జగన్. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అవి రూ.2.69 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించారు. చంద్రబాబు హయాంలో రుణాలు 144 శాతం పెరిగినట్లు చెప్పారు సీఎం జగన్. ఈ మూడేళ్లలో ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.1. 71 లక్షల కోట్ల అని, గత అప్పుతో కలుపుకుంటే రూ.4.99 లక్షల కోట్లకు రుణాలు పెరిగాయన్నారు.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చంద్రబాబు చూస్తున్నారని, అంత నీచమైన స్థాయికి ఏ నాయకుడూ పోడు అన్నారు సీఎం జగన్వికేంద్రీకరణ అనేది ఒక అవసరమని, పరిపాలన అనేది మారుమూల గ్రామాలకు సైతం ఎఫెక్టివ్‌గా అందాలంటే వికేంద్రీకరణ జరిగి తీరాలన్నారు.