
తిరుపతిలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు శాంతా క్లాజ్ టోపీ పెట్టడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటన హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతూ, రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగాయి.
భజరంగదళ్ మరియు హిందూ కార్యకర్తలు ఈ ఘటనను హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి చేసినట్టుగా భావిస్తున్నారు . “అన్నమయ్యను అవమానించే ఈ చర్య పట్ల వ్యతిరేకిస్తూ, ఇది హిందువుల పట్ల జరిగిన అపచారం,” అంటూ వారు వ్యాఖ్యానించారు.
అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.