
cm jagan
- వ్యవసాయ అనుబంధ రంగాలపై జరిగిన సమీక్షలో సీఎం జగన్
ఆర్బీకేల పరిధిలో వైఎస్సార్ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సచివాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన యంత్రసేవ, పాలసేకరణ, గోదాముల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ప్రధానంగా వైఎస్సార్ ఆర్బీకేలు, యంత్రసేవపై జగన్ దృష్టి సారించారు.
రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న ఉన్న యంత్రాలు, వాటి సేవల వివరాలను సమగ్రంగా రైతులకు తెలియజేసేలా ఈ పోస్టర్లను రూపొందించాలని సీఎం సూచించారు. 10,750 ఆర్బీకేల పరిధిలో ఇప్పటికే 6525 ఆర్బీకేల్లో యంత్రసేవకింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ ఇప్పటికే పూర్తి చేసినట్లు వివరించారు. 1615 క్లస్టర్ లెవల్ సీహెచ్‌సీల్లో 391 చోట్ల ఇప్పటికే యంత్రసేవ కింద హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాలు ఆర్బీకేలకు చేరుకున్నట్లు వెల్లండించారు. మొత్తం రూ. 690.87 కోట్ల విలువైన పరికరాలను ప్రభుత్వం అందించగా.. ఇందులో సర్కారు అందించిన సబ్సిడీ 240.67కోట్లు అని జగన్ పేర్కొన్నారు.
సమీక్షలో నిర్ణయాలు..
- 2022–23కు సంబంధించి యంత్ర సేవకు సంబంధించి కార్యాచరణ సిద్ధం
- సుమారు 7 లక్షల మందికి యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు సిద్దంగా కార్యాచరణ
- 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు యంత్రసేవకింద పరికరాలు, మిగిలిన 20శాతం మిగిలిన వారికి పంపిణీ
- షెడ్యూల్డ్ ఏరియాల్లో 80శాతం ఎస్టీ రైతులకు ఇవ్వాలని నిర్ణయం
- ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ చేయాలి
- ఇందుకోసం రూ.1325 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.1014 కోట్లు
ఆర్బీకేల పరిధిలో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్‌రూమ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి సీఎం జగన్ అధికారును ఆదేశించారు. వీలైనంత త్వరగా వీటి నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. అలాగే ఆర్బీకేల్లో గోదాముల నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
చేయూత పథకం కింద పశువులను పంపిణీచేయడం ద్వారా పాల ఉత్పత్తి, విక్రయం తదితర వ్యాపారాల ప్రక్రియను ప్రోత్సహించాలని జగన్ ఆదేశించారు. ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందని చెప్పారు. అమూల్, అలానా లాంటి కంపెనీలతో భాగస్వామ్యం వల్ల లబ్ధిదారులైన మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం పొందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అమూల్ పాలసేకరణ..
2,34,548 మహిళా రైతుల నుంచి అమూల్ పాల సేకరణ చేస్తోంది. పాలసేకరణ వల్ల ఇప్పటివరకూ రూ.179.65 కోట్ల చెల్లింపు, రైతులకు అదనంగా రూ.20.66కోట్ల లబ్ధి జరిగినట్లు జగన్ చెప్పారు. అమూల్ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా డెయిరీల ధరలు పెంచడంవల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా రూ.2,020.46 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు అమూల్ పాలసేకరణను విస్తరించనున్న చెప్పారు. అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 1.03 లక్షల లీటర్ల పాలసేకరణ జరుగుతుందన్నారు. చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు.
ధాన్యం సేకరణ..
మిల్లర్ల పాత్రను పూర్తిగా తీసివేసేలా, పారదర్శకంగా జరిగేలా, రైతుల ప్రయోజనాలకు ఏ దశలోనూ భంగం రాకుండా ధాన్యం సేకరణ చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో పలు విధానాలకు కసరత్తు చేసిన పౌరసరఫరాల శాఖ అధికారులు.. దానికి సంబంధించిన వివరాలను జగన్ కు వివరించారు.
ధాన్యం సేకరణలో వలంటీర్లను భాగస్వామ్యం చేయాలని పౌరసరఫరాల సంస్థ సీఎం జగన్ కు సూచించింది. ఇందుకోసం వారికి ఇన్సెంటివ్‌లు అందించాలని అధికారులు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ఎస్ఓపీలను పకడ్బందీగా తయారు చేయాలని సీఎం ఆదేశించారు.