
cm jagan
స్కూళ్లలో టాయిలెట్ల మెయింటెనెన్స్కోసం ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణకోసం ఏర్పాటుచేసిన ఎస్ఎంఎఫ్తరహాలో అంగన్వాడీల నిర్వహణ, పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అంగన్వాడీలకు కూడా ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు.
అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ పిల్లలకు ఇప్పటినుంచే భాష, ఉచ్ఛారణలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు సీఎం జగన్. పాఠశాల విద్యాశాఖతో కలిసి పగడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. అన్నీకూడా బైలింగువల్టెక్ట్స్బుక్స్ఉండాలన్నారు.
అంగన్వాడీలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీపై ఈ సందర్భంగా చర్చించారు సీఎం జగన్. ప్రస్తుతం జరుగుతున్న కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు సీఎం జగన్.
పంపిణీలో కూడా అక్కడక్కడా లోపాలు తలెత్తుతున్న సమాచారం నేపథ్యంలో పగడ్బందీ విధానాలు అమలు చేయాలని ఆదేశించారు. నాణ్యతను పూర్తిస్థాయిలో చెక్‌చేసిన తర్వాతనే పిల్లలకు చేరాలని సూచించారు. మార్క్‌ఫెడ్‌ఆధ్వర్యంలో కొనుగోళ్లు, పంపిణీని పైలట్ప్రాజెక్ట్కింద చేపట్టాలని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. పేరొందిన సంస్థతో థర్డ్‌ఫార్టీ తనిఖీలు జరిగేలా చూడాలన్నారు.
బాల్య వివాహాల విషయంలో సీఎం జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు. కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం ఉందని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంగన్వాడీల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబర్‌తో ఉన్న పోస్టర్‌ను ప్రతి అంగన్వాడీలో ఉంచాలని ఉంచాలన్నారు.
దివ్యాంగులకోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్‌ను అప్‌గ్రేడ్‌చేయాలని సీఎం ఆదేశించారు. దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
సెప్టెంబరు 30 కల్లా అంగన్వాడీ సూపర్వైజర్ల భర్తీ
సెప్టెంబరు 30 కల్లా అంగన్వాడీ సూపర్వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని అధికారులు సీఎం జగన్ కు వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.