
cm jagan tour
రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం వైఎస్ జగన్ తిరుమలకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆయన వచ్చారు. తొలుత సీఎం జగన్ కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
ఆ తర్వాత సీఎం జగన్.. గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, సీఎం జగన్కు అర్చకులు వేదాశీర్వచనం అందించారు.
ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కే నారాయణస్వామి, రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, రాజ్య సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి, చిత్తూరు, రాజంపేట ఎంపీ లు గురుమూర్తి, రెడ్డప్ప, మిథున్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంఎల్సీలు కళ్యాణ చక్రవర్తి, భరత్, తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, పూతలపట్టు, పీలేరు, రాజంపేట, సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు భూమన కరణాకరరెడ్డి, కోనేటి అదిమూలం, బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఎం ఎస్ బాబు, చింతల రామచంద్రారెడ్డి పలువురు ఉన్నతాధికారులు హాజరు.