
జనవరి 21, 2025న డావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ పారిశ్రామికీకరణపై ప్రసంగించారు. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) తరఫున మాట్లాడిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ మరియు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చే తన విసన్ను వివరించారు.
1995 నుంచి CIIతో ఉన్న తమ అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, హైదరాబాద్‌ను ఐటీ మరియు ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చిన తన అభివృద్ధి కృషిని ఆయన ఉదాహరణగా చూపుతూ. 2047 నాటికి భారత్ టాప్ 2 గ్లోబల్ ఎకానమీలలో ఒకటిగా నిలుస్తుందని, భారతీయులు సంపద సృష్టిలో ముందుండే అవకాశముందని ఆయన తెలిపారు.
తక్కువ సమయంలో ప్రాబల్యమున్న సమస్యలను పరిష్కరించడానికి AI మరియు రియల్-టైమ్ డేటాను ఉపయోగించడం అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ (GLC)ను ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ నాయకత్వ అభివృద్ధిని మెరుగుపరచడం తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని IMD బిజినెస్ స్కూల్ మరియు GLC మధ్య ఒప్పంద పత్రం పరస్పరం మార్చుకున్నారు.
సస్టైనబిలిటీ ప్రాముఖ్యతను వివరించిన ఆయన, ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడంతో పాటు ప్రజలను పాలనలో భాగస్వాములుగా మార్చే “P4 మోడల్” (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్)ను ఆయన ప్రతిపాదించారు. పేదరికం మరియు అసమానతను తొలగించడంలో కార్పొరేట్ నాయకత్వం కీలకమైనది అని అన్నారు.
ఆధునిక పరిజ్ఞానం, గ్రీన్ పారిశ్రామికీకరణ, సుస్థిర అభివృద్ధితో ప్రపంచ అభివృద్ధిని ముందుండి నడిపించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.