
BCA Meeting
ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావవేశాలు గురువారం ప్రారంభమయ్యయి. సభ ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో సభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. దీంతో టీడీపీ సభ్యుల తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పుబట్టారు.
- టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారు- రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
- టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారారు, త్వరలో జరగబోయేది టీడీపీకి శవయాత్రే – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి
- పేదలకు, ఎస్సీలకు చంద్రబాబు ఏనాడు మేలు చేయలేదు- జోగారావు, పార్వతీపురం ఎమ్మెల్యే
- నిరుద్యోగ భృతీ ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారు – – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ మంత్రి
- సభలోకి ప్లకార్డులు తీసుకురావడం సరికాదు- బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఆర్థిక మంత్రి
టీడీపీ ప్రతిపాదించిన 17 అంశాలపై చర్చకు ప్రభుత్వం అంగీకారం
అయితే సమావేశాలకు ముందు.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీసీఏ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ తోపాటు మంత్రులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయిడు పాల్గొన్నారు.
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై బీసీఏలో నిర్ణయానికి వచ్చారు. టీడీపీ నాయకులు సూచించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం. ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ ప్రతిపాదించిన 17 అంశాలను చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించింది.
అయితే బీసీఏ సమావేశం సందర్భంగా సీఎం జగన్, అచ్చెన్నాయిడు మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ ఏ విషయం గురించి మాట్లాడాలన్నా.. అ విషయంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగా టీడీపీ సూచించిన 17 అంశాలను ఎజెండాలో చేర్చారు.
అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరగడానికి ప్రతిపక్ష పార్టీ టీడీపీ సహకరించాలని మంత్రులు, ముఖ్యమంత్రి.. టీడీపీని కోరారు. సభలో ఎలాంటి ఆందోళనలు చేయకుండా.. ప్రతి అంశంపై చర్చ జరిగేలా చూడాలని కోరినట్లు తెలుస్తోంది.