
harassment
టీడీపీ నాయకులపై వైధింపులు కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విజయవాడలో వినోద్ జైన్ చేతిలో వేధింపులకు గురై ప్రాణాలు తీసుకున్న బాలిక ఘటన మర్చిపోకముందే.. తాజాగా కదిరిలో రాళ్లపల్లి ఇంతియాజ్ అనే టీడీపీ నాయకుడి వేధింపులకు మరో చిన్నారి బలైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి అనేక దారుణులకు పాల్పడిన వారిని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబే వెనుకేసుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎంఆర్ ఓ వనజాక్షి విషయంలో ఆమెకి అండగా నిలబడాల్సిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తిరిగి ఆమెనే తప్పు పట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా తమని చంద్రబాబు కాపాడుతారు అనే ధైర్యమో లేక మరే అండ చూసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.
సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం విషయంలోనూ.. చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. చంద్ర బాబు ప్రభుత్వం తమకు కొమ్ము కాస్తుంది అని భావించి గతంలో ఇలాంటి ఘటనలకు టీడీపీ శ్రేణులు పాల్పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రిషితేశ్వరి కేసులో కూడా ఇదే జరిగినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన పార్టీ శ్రేణులను అనుచరులను కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లలకి ఘోరమైన అన్యాయం తలపెట్టారనే అపావాదును టీడీపీ అధినేత మూట గట్టుకున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతికి ఘోరమైన సంబంధాలు అంటగట్టి.. తనకు వత్తాసు పలికే మీడియాలో చర్చలు పెట్టినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీలోని కింది స్థాయి నాయకులే కాదు.. చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి ఇలా అనేక మంది మాజీ మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లే కావడం గమనార్హం.
అప్పట్లో అధికారం చేతిలో ఉండడం వల్ల ఇలాంటి మరెన్నో విషయాలు, సంఘటనలు బయటికి రాకుండా పోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ఆరోపణలపై కూడా విచారించి నిజ నిర్ధారణ జరిగితే ఆ నిందితులను కూడా తీవ్రంగా శిక్షించాలని పోలీస్ శాఖ వారిని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని మహిళా సంఘాలు కోరుతున్నాయి.