
జనసేన పార్టీకి గుడ్ న్యూస్! కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు శాశ్వత ‘గ్లాస్ టంబ్లర్’ ఎన్నికల గుర్తు కేటాయిస్తూ కీలక ప్రకటన చేసింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనను బలమైన ప్రాంతీయ రాజకీయ పార్టీగా గుర్తించినట్లు ఓ అధికారిక లేఖలో స్పష్టం చేసింది.
ఇది జనసేన పార్టీకి చాలా కీలకమైన ఘట్టం. గత సాధారణ ఎన్నికల్లో జనసేన అదిరే ప్రదర్శనతో 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు సీట్లలో విజయం సాధించి 100% విజయశాతం నమోదుచేసింది.
ఈ శాశ్వత గుర్తు కేటాయింపుతో జనసేనకు ప్రజల్లో మరింత బలమైన గుర్తింపు ఏర్పడింది. ఈ భారీ విజయంతో జనసేన రాజకీయంగా మరింత శక్తివంతమైన స్థానానికి ఎదిగింది అని మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.