ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్లోని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న భాజపా ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేసింది.
పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ “ఢిల్లీ గడ్డ భాజపా అడ్డా” అంటూ నినాదాలు చేశారు. విజయవాడలోని భాజపా కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మరియు మరికొందరు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
ఈ విజయాన్ని సాధించిన అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు ఏపీ వాల్లి ఓటర్లకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. అవినీతిలో మునిగిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీకి అన్ని వర్గాల ఓటర్లు గుణపాఠం చెప్పారని వారు అభిప్రాయపడ్డారు.