
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న.. టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ.. టాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బాలయ్య చాలా రోజులుగా తన కుమారుడు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కథలను కూడా విన్నారు బలయ్య. ఇన్నాళ్లు సరైన కథ కుదరకపోవడం వల్ల.. మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఆలస్యమైనట్లు సమాచారం. అలాగే ఏ డైరెక్టర్ తో తన కుమారుడు ఎంట్రీ ని ప్లాన్ చేయాలో ఇంకా ఫిక్స్ కాలేక పోయారు.
గతంలో ఒకసారి బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా కామెంట్లు చేశారు. మోక్షజ్ఞ తప్పకుండ ఎంట్రీ ఇస్తాడు కానీ.. కొద్దిగా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. జాతకాలను బాగా విశ్వసించే బాలయ్య.. ఆయన కుమారుడిని 2023లో గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే డైరెక్టర్ ఖరారు అయ్యాక.. బాలయ్య అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఎంట్రీ కోసం మోక్షజ్ఞ కూడా తన ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారట. జిమ్ లో గంటల కొద్ది శ్రమిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీతో నందమూరి కూటుంబంలో యంగ్ హీరోల జాబితా నాలుగుకు చేరింది. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారక రత్న, చైతన్య కృష్ణ ఉన్నారు.