
balayya unstoppable season 2
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే. ఏది చెప్పినా సంచలనమే. ఆయన యూత్ తో యువకుడిగా.. పెద్దవాళ్లతో పెద్దరికంగా ఉంటారు. సమయం వచ్చినప్పుడు బాలయ్య కుర్రాళ్లతో చేసే రచ్చ మామూలుగా ఉండదు. కొంటె ప్రశ్నలతో ఆయన పెట్టే గిలిగింతలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
తాను వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్ స్టాపబుల్’ షోలో బాలయ్య చేస్తున్న చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. మొదటి సీజన్ కు మించి రెండో సీజన్ కు మంచి ఆదరణ దక్కుతోంది. తాజాగా రెండో సిజన్ లోని మూడో ఏపిసోడ్ ప్రోమో విడుదలైంది. లేటేస్ట్ ఎపిసోడ్ కు యువ హీరోలు శర్వానంద్, అడవి శేష్ అతిథులుగా వచ్చి.. బాలయ్యతో కలిసి హంగామా చేశారు.
తనకు రష్మిక అంటే ఇష్టమని బాలయ్య గతంలో చెప్పారు. ఈ క్రమంలో షోలోకి అడుగు పెట్టగానే.. శర్వానంద్ రష్మికతో వీడియో కాల్ మాట్లాడించారు. అనంతరం శర్వానంద్.. బాలయ్యను కొంటె ప్రశ్న అడిగాడు. ‘ మీరు ఇప్పటివరకు 100పైగా సినిమాలు చేసి ఉంటారు. అంటే దాదాపు 25 నుంచి 30 హీరోయిన్లను చేసి ఉంటారు కదా’ అని శర్వా ప్రశ్న అడిగాడు. దీనికి బాలయ్య తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ‘ ఇవన్నీ బీ సెంటరోడి తెలివి తేటలు’ అంటూ బాలయ్య బదులిచ్చారు.
అనంతరం శర్వాను ఇరికించే.. ప్రశ్న అడిగారు బాలయ్య. యాక్టింగ్ స్కిల్స్ ను వారికి రేటింగ్ ఇవ్వాలంటూ.. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ పేర్లను చెప్పారు బాలకృష్ణ. దీంతో శర్వానంద్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. సరదా.. సరదా.. ముచట్లు, డ్యాన్సులతో ప్రోమో ఆసాంతం ఆకట్టుకుంది.