
posani krishna murali
ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసానిని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పోసాని నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు పోసాని కృష్ణమురళి కృషి చేశారు. వైసీపీకి అవసరమైనప్పుడు తన సేవలకు అందిస్తూ.. వస్తున్నారు. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి రాగానే.. పోసానికి కీలక పదవిని కట్టబెడతారనే అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల.. అది వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా ఎట్టకేలకు పోసానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు సీఎం జగన్. సినిమా ఇండస్ట్రీలో పోసానికి దాదాపు 30ఏళ్లకు పైగా అనుభవం ఉంది. పరిశ్రమలోని అన్ని సమస్యలు తెలిసి వ్యక్తిగా ఈ పదవికి సరైన న్యాయం పోసాని చేస్తారనే నమ్మకంతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించినట్లు తెలుస్తోంది.