
విజయవాడ: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి మహా ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి. శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు, పట్టణ అధ్యక్షులు రంజిత్, పట్టణ కార్యదర్శి ప్రతాప్, సహాయ కార్యదర్శి శివరాం, ఉపాధ్యక్షుడు మస్తాన్ పిలుపునిచ్చారు.
కార్మికుల ప్రధాన డిమాండ్లు:
🔹 మున్సిపల్ రంగంలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి
🔹 సమాన పనికి సమాన వేతనం అమలు చేసి, కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
🔹 పీఎఫ్, ఈఎస్ఐ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
🔹 పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 35,000 నిర్ణయించాలి
🔹 విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి
🔹 ఉద్యోగ భద్రత కల్పించాలి
ఈ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులందరూ విజయవాడ మహా ధర్నాకు భారీగా హాజరై ఉద్యమాన్ని విజయవంతం చేయాలని యూనియన్ నేతలు పిలుపునిచ్చారు.
Also read:
https://deccan24x7.in/telugu/guntur-corporator-husband-extortion/