
Harish amaranath sajjal
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన కామెంట్లు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఏపీ ప్రభుత్వం టార్గెట్ గా హరీశ్ రావు ఈ మధ్య వరుస పెట్టి చేస్తున్న పెట్టి చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. అయితే గతంలో చేసిన కామెంట్లపై అంతగా చేసిన కామెంట్లను అంతగా స్పందించని ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. తాజాగా హరిశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
హరీశ్ రావు ఏమన్నారంటే?
ఏపీలో టీచర్లను ఉద్దేశించి హరీశ్ రావు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందన్నారు. టీచర్లపై ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో కూడా హరీశ్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చాలా సార్లు చేశారు.
మోటార్లకు మీటర్లు పెట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం అంటే మన రాష్ట్రానికి ఇచ్చే 30 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందన్నారు. జగన్‌లా కేంద్రం మాటకు ఒప్పుకుని ఉంటే ఏటా 6 వేల కోట్లు వచ్చేవన్నారు హరిశ్. ఏపీలోని రోడ్లు, కరెంట్ సరఫరా పైనా కూడా అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు.
సజ్జల ఫైర్..
హరీశ్ రావు వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఆయన మాటల్లో వాస్తవం లేదని ఏపీ మంత్రులు, నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. హరీశ్ రావుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్తో తమకు ఎలాంటి సమస్యలు లేవన్నారు. తమపై విమర్శలు చేసిన హరీష్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ తో వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలియదని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీగా హరీశ్ రావు తమపై విమర్శలు చేయలేదని తాము భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దష్టచతుష్టయం చాలా కాలం నుంచి చెబుతున్న దాన్నే హరీష్ రావు చెబుతున్నారని సజ్జల అన్నారు. ఆ గ్యాంగ్ తో జతకట్టి హరీష్ రావు మాట్లాడినట్టుగా అనిపిస్తుందని సజ్జల అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణలో సమస్యలు చూసుకోకుండా ఏపీ పై కామెంట్ చేయడం సరైంది కాదని సలహా ఇచ్చారు. రెండు రాష్ట్రాల సమస్యలను చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదన్నారు.
హరీష్ రావు.. రామోజీరావు మనిషా?
హరీశ్ వ్యాఖ్యలను మంత్రి గుడివాడ అమర్ నాథ్ సైతం తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్, కేసీఆర్, హరీష్‌రావును చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి వైఎస్ఆర్సీపీకీ లేదని స్పష్టం చేశారు.
“మమ్మల్ని తిడితే మీకు మార్కులు పడతాయా? అని ప్రశ్నించారు. ఏపీ భవన్లో హరీష్‌రావు అధికారిని కాలితో తన్నిన ఘటన జనం మర్చిపోలేదు, హరీష్ రావు.. సీఎం కేసీఆర్ మనిషా లేక రామోజీరావు మనిషా అనేది తేల్చుకోవాలి. తెలంగాణను చూసి మేం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మమ్మల్ని విమర్శిస్తే కేసీఆర్‌ను తిడతామని హరీష్‌రావు అనుకుంటున్నారేమో. కేసీఆర్‌కు హరీష్‌రావుకు గొడవలుంటే వాళ్లలో వాళ్లు చూసుకోవాలి. మమ్మల్ని మధ్యలోకి లాగొద్దు” – మంత్రి అమర్ నాథ్
హరీశ్ రావుపై ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తీవ్రంగా స్పందించారు. రామోజీ రావు, రాధాకృష్ణలకు హరీశ్ రావు అమ్ముడు పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో విద్యావ్యవస్థను ఏ విధంగా అభివృద్ది చేస్తున్నామో దేశమంతా చూస్తోందని, రాబోయే రోజుల్లో టీచర్లకు ఇంకా మంచి జరుగుతుందని తెలిపారు. హరీశ్ వాఖ్యల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని అనుకోనవట్లేదన్నారు.