
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండగకు శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ ప్రక్రియ డిసెంబర్ 28 వరకు కొనసాగనుంది.
దరఖాస్తులను పరిశీలించిన తరువాత, అర్హులైన వారికి కొత్త డిజైన్లో, కుటుంబ సభ్యుల ఫోటోతో పాటు క్యూఆర్ కోడ్ కలిగిన రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. వచ్చే సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి, కొత్త రేషన్ కార్డులు అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.