
విజయవాడ | విశాఖపట్నం: ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అంగన్వాడీ కార్మికుల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల వరకు అనేక వర్గాలు తమ హక్కుల కోసం రోడ్డెక్కుతున్నాయి.
కూటమి ప్రభుత్వ మోసపూరిత హామీలపై అంగన్వాడీల ఉద్యమం
🔹 విజయవాడలో అంగన్వాడీల మహా ధర్నా
🔹 అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద వేలాదిగా చేరిన అంగన్వాడీ కార్యకర్తలు
🔹 తమ సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్
🔹 నిరసన తీవ్రత దృష్టిలో ఉంచుకుని భారీగా మోహరించిన పోలీసులు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. తమ వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వంచనగా మారాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన
🔹 విధుల నుంచి తొలగించిన 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లో చేర్చాలని డిమాండ్
🔹 45 ఏళ్లు దాటిన తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన
🔹 సమస్య పరిష్కరించకపోతే మార్చి 11 నుంచి ప్లాంట్ నుంచి ఉత్పత్తి నిలిపివేస్తామని హెచ్చరిక
విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయమని వారు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే మార్చి 11 నుంచి ప్లాంట్‌కి తాళం వేసే స్థాయికి వెళ్తామని హెచ్చరించారు.
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం తొమ్మిది నెలలే పూర్తయినా, అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది.
🔹 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఓటేసిన ఉపాధ్యాయులు
🔹 గ్రూప్-2 అభ్యర్థుల నిరసనలు
🔹 మిర్చి రైతుల ఆందోళనలు
🔹 ఆశా వర్కర్ల ధర్నాలు
🔹 అంగన్వాడీ కార్యకర్తల పోరాటం
🔹 VROల సమ్మె
🔹 మున్సిపల్ శానిటేషన్ కార్మికుల నిరసనలు
🔹 APCOS ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలు
🔹 విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన
తొమ్మిది నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత
ప్రతి వర్గాన్ని మోసం చేసిందనే భావన ప్రజల్లో గట్టిగా బలపడుతుంది. ఎన్నడూ లేని విధంగా కేవలం తొమ్మిది నెలల పాలనలోనే అన్ని వర్గాల నిరసనలను ఎదుర్కొంటున్న ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి.
ప్రజా సమస్యలపై స్పందించకుండా ప్రభుత్వం మౌనం పాటిస్తే, ఈ నిరసనలు మరింత ఉధృతంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.