
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ భేటీ సెప్టెంబర్ 1న జరగాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఈ నెల 31న వినాయక చవితితో పాటు సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు సీఎం జగన్ కడప పర్యటనలో ఉండటంతో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 7న మంత్రిమండలి సమావేశం జరగనుందని తెలిపింది.
వైఎస్ఆర్ కడప జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు బయల్దేరనున్నారు.