
CABINET MEETING
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. కేబినెట్ లో మొత్తం 57అంశాలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
- వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి ఆమోదం తెలుపుతూ క్యాబినెట్ లో నిర్ణయం
- 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏపీ సీఆర్డీఏలో ఫేస్ – 1 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, మౌలిక సదుపాయాలకు రూ.1,600 కోట్లు గ్యారెంటీ ఇచ్చేందుకు ఆమోదం
- ఏపీసీఆర్డీఏ -2014 చట్టంలో పలు సవరణలు చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ది కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకొనేందుకు ఆమోదం
- భావనపాడు పోర్టు నోటిఫికేషన్ – 1 లో సవరణలు చేయాలని నిర్ణయం
- స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర
- ఆగస్టు 15, 2022 ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 20 మంది ఖైదీలకు ఉపశమనం కలిగించాలని నిర్ణయం
- తిరుపతి జిల్లాలో నోవాటల్ ఫై స్టార్ హోటల్ అభివృద్దికి ఆమోదం
- ఏపీ జీఎస్టీ సవరణ డ్రాఫ్ట్ బిల్లు 2022 కు ఆమోదం
- వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం 379 లబ్దిదారులకు 7వ దశ పరిహారం చెల్లింపు
- వారి పట్టాలను రద్దు చేస్తూ భూమిని కార్పొరేషన్ కు అప్పగించాలని నిర్ణయం
- ఆంధ్రప్రదేశ్ టెండెన్సీ యాక్ట్ 1956 ను రీపీల్ చేసే డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం
- పునురుత్పాదక ఇంధన ఎక్స్పోర్ట్ పాలసీ-2020 కు సవరణలకు ఆమోదం
మంత్రులపై సీఎం జగన్ ఆగ్రహం
కేబినెట్ సమావేశంలో మంత్రులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాం అంశం క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ విషయంలో దుష్ట చతుష్టయంపై ఎందుకు గట్టిగా స్పందించడం లేదని మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి మీటింగ్ లో నేనే మాట్లాడాలంటే ఎలా అని.. మీరు కూడా స్పందించాలని మంత్రులతో జగన్ అన్నట్లు సమాచారం. దుష్ట చతుష్టయానికి ఎందుకు భయపడుతున్నారని, ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని సీఎం జగన్.. మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.