
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వయంగా ప్రభుత్వ నిధులపై ప్రశ్నించగా, డిప్యూటీ స్పీకర్ సమాధానం చెప్పలేక మైక్ కట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే ప్రశ్న:
“ప్రభుత్వం కమిషన్ ద్వారా 1000 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ నిధులు ఏమయ్యాయో మంత్రి గారు వివరించాలి.”
డిప్యూటీ స్పీకర్ స్పందన:
“ఇప్పుడు లెక్కలు చెప్పాలంటే కష్టంలే..”
ప్రభుత్వం తీరుపై స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికార పక్షానికి చెందిన నేతలు కూడా ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు వేయడం, వారికి సరైన సమాధానం అందని పరిస్థితి అధికార యంత్రాంగంలో సమన్వయ లోపాన్ని చూపుతున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అసెంబ్లీలో అధికారపక్షం స్వయంగా తమకు తామే ప్రశ్నించుకోవడం, కానీ సమాధానం లేకుండా మైక్ కట్ కావడం ప్రభుత్వంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ 1000 కోట్ల నిధులు ఏమయ్యాయి? మంత్రులు దీనిపై స్పష్టత ఇవ్వగలరా? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
Also read:
https://deccan24x7.in/telugu/jana-sena-helpless-puppet-in-tdp-hands/